విశాలాంద్ర – వలేటివారిపాలెం : మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో లింగ నిర్దారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం అని నువ్వు అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు.కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలం లోని కేజీబీవీ పాఠశాల నందు సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మిషన్ శక్తి 20 రోజుల ప్రోగ్రాం లో భాగంగా కేజీబీవీ విద్యాలయంలో గురువారం ప్రిన్సిపాల్ అరుణకుమారి అధ్యక్షతన అంగన్వాడీ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గర్భస్థ శిశు లింగ నిర్దారణ చట్టం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా అంగన్వాడి సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ కిశోర బాలికలకు మరియు ఉపాధ్యాయులకు గర్భస్థ శిశులింగ నిర్ధారణ నిషేధ చట్టం గురించి భారతదేశంలో ఆడ బ్రూణ హత్యలను అరికట్టడానికి మరియు లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి రూపొందించబడినదని అన్నారు.ఇది గర్భధారణకు ముందు తర్వాత లింగ నిర్ధారణ పరీక్షలను, ప్రకటనలను పూర్తిగా నిషేధిస్తుందని, దీనిని ఉల్లంఘించిన వారికి జరిమానా మరియు జైలు శిక్ష కూడా పడుతుందని అన్నారు.దీని యొక్క ప్రధాన ఉద్దేశం లింగ నిష్పత్తిని కాపాడటం లింగ ఎంపికను నిషేధించడం ఆడపిల్లను పుట్టకముందే చంపడాన్ని నిరోధించడం దీని ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ అరుణకుమారి మాట్లాడుతూ కిశోర బాలికల పోషకాహారం లైంగిక ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రత, ఋతు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత,ప్రిన్సిపాల్ అరుణకుమారి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


