పోరు…హోరు


ఇరాన్ ప్రతిదాడులు తీవ్రతరం

. గల్ఫ్ లక్ష్యాలపైకి క్షిపణులు, డ్రోన్లు
. లెబనాన్‌లో ఐడీఎఫ్ భూతల దాడులు
. ఐదు రోజుల్లో 1,045 మంది మృతి
. వారంలోగా ఇరాన్ గగనతలం స్వాధీనం: అమెరికా
. ఒకట్రెండు వారాల్లో లక్ష్యాలన్నీ ధ్వంసం: ఇజ్రాయిల్

తెహ్రాన్: క్షిపణలు, బాంబులతో పశ్చిమాసియా మండుతోంది.అటు అమెరికాఇజ్రాయిల్, ఇటు ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పరస్పర దాడులతో భీతావహం సష్టిస్తున్నాయి. అమెరికాఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ ప్రతి దాడులు చేయడంతో పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధం బుధవారానికి ఐదో రోజుకు చేరుకుంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్సొ (ఐఆర్‌జీసీ) కమాండ్ పోస్టులు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగస్థలాలపై తమ సైన్యం దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయిల్ కూడా తన దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ క్షిపణి ప్రయోగశాలలు, కర్మాగారాలపై విరుచుపడింది. ఒకటి, రెండు వారాల పాటు తమ దాడులు కొనసాగుతాయని, ఈలోగా ఇరాన్‌లోని లక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని ఇజ్రాయిల్ తెలిపింది. మరో వారం రోజుల్లో ఇరాన్ గగనతలం పూర్తిగా తమ అధీనంలోకి వస్తుందని అమెరికా దీమా వ్యక్తంచేసింది. ఈ యుద్ధంలో గెలుపు తమదేనని ప్రకటించుకుంది. ఇరాన్ బలహీనపడిపోయిందని పేర్కొంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వర్గాలు, స్వచ్ఛంద సంస్థల నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. క్షిపణులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయిల్ సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తోంది. 165 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన మినాబ్ ఘటనపై నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తునకు ఐరాస మానవ హక్కుల అధినేత పిలుపునిచ్చారు. సైనికులు, పౌరులు కలిపి మొత్తం 1,045 మంది మరణించారని ఇరాన్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ మార్టైర్స్ అండ్ వెటరన్స్ అఫైర్స్ ప్రకటన పేర్కొంది. తాజా పరిణామాలతో ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చమురు విపణుల నుంచి తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయిల్అమెరికా దాడులకు ఇరాన్ దీటుగా బదులిచ్చింది. గల్ఫ్ వ్యాప్తంగా ప్రతి దాడులు ముమ్మరం చేసింది. ఇంధన సరఫరాను దెబ్బతీసింది. పారిశ్రామిక ప్రాంతాýను లక్ష్యం చేసుకుంది. బహ్రెయిన్, ఖతార్‌లోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేసింది. రియాద్‌లోని అమెరికా ఎంబసీపై రెండు డ్రోన్లతో దాడి జరిగిందని, మంటలు చెలరేగడంతో స్వల్ప నష్టం వాటిల్లిందని సౌదీ అరేబియా వెల్లడించింది. దీంతో కాన్సులర్ సేవలను ఎంబసీ నిలిపివేసింది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు లెబనాన్‌లో వైమానిక దాడులను ఇజ్రాయిల్ పెంచింది. రాజధాని బీరుట్ సమీపంలో అధ్యక్ష భవనం ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. రాజధానిలోని దక్షిణ భాగంలోనూ దాడులు చేసింది. ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా లక్ష్యంగా భూతల దాడుల్లో భాగంగా దక్షిణ లెబనాన్ పట్టణం ఖైమ్‌లోకి ఇజ్రాయిల్ దళాలు చొరబడ్డాయి. ఇదే క్రమంలో లిటానీ నదికి దక్షిణం వైపున ఉన్న వారంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు చేసింది. ఆ ప్రాంతంలో హెజ్బుల్లాకు వ్యతిరేకంగా సైనిక చర్యలు తీసుకోక తప్పడం లేదని పేర్కొంది. తాము భీకర దాడులు చేస్తూ, ఇరాన్ స్థావరాలను ధ్వంసం చేస్తూ, సైనిక శక్తిని దెబ్బ తీస్తున్నప్పటికీ క్షిపణులతో దాడి చేసే సామర్థ్యాన్ని ఇరాన్ కలిగివున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఇరాన్ పట్టుదలతో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అమెరికాతో చర్చల ఉద్దేశం లేదని స్పష్టంచేసింది. ఖామేనీ అంత్యక్రియలు వాయిదా అధినేత ఖామేనీ అంత్యక్రియలకు సంబంధించిన అధికారాకి కార్యక్రమం తెహ్రాన్‌లో బుధవారం సాయంత్రం ప్రారంభం కావాల్సి ఉండగా, అసాధారణ పరిస్థితులు నెలకొనే అంచనాల దష్ట్యా దీనిని వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ‘ప్రియతమ నాయకుడికి తుది వీడ్కోలు పలికే కార్యక్రమం వాయిదా పడింది. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తాం’ అని ఇరాన్ టీవీ పేర్కొంది. ఈ వాయిదాకు అధికారులు భద్రతాపరమైన కారణాలు చెప్పకపోవడం గమనార్హం. లక్షలాది మంది తరలివచ్చేందుకు అవకాశం ఉండటంతో వారికి సముచిత ఏర్పాట్లు చేయాల్సిన దష్ట్యా ఈ నిర్ణయం జరిగినట్లు తెహ్రాన్ ఇస్లామిక్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధినేత మొసీన్ మహ్మూదీ వెల్లడించారు. ఖామేనీ జన్మస్థలమైన మషాద్ నగరంలోనే అంత్యక్రియలు జరగనున్నాయి. ఖామేనీ హత్యతో నూతన అధినేత ఎంపికకు ఇరాన్ కసరత్తు వేళ ఎవరిని ఎన్నుకున్నా హతమారుస్తామంటూ ఇజ్రాయిల్ హెచ్చరించింది. ఇజ్రాయిల్అమెరికా హెచ్చరికలు చేస్తున్నాగానీ ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ప్రతిదాడులతో ఆ దేశాలను దీటుగా ఎదుర్కొంటోంది. ఇజ్రాయిల్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ క్షిపణుల దాడితో జెరూసలేంలో ఎయిర్ సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణులను గుర్తించినట్లు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు ముప్ప్పును తొలగించాయని పేర్కొంది.
సౌదీ అరామ్‌కోపై మళ్లీ దాడి
సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు క్షేత్రం అరామ్‌కో రిఫైనరీపై బుధవారం గుర్తుతెలియని క్షిపణితో దాడి జరిగింది. తొలుత డ్రోన్ దాడి జరిగిందని, దాని వల్ల ఎలాంటి నష్టం లేదని సౌదీ రక్షణ శాఖ అధికారి వెల్లడించారు. తమ ఇరుగు పొరుగు దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులను ఇరాన్ కొనసాగించగా, వాటిని సమర్ధంగా అడ్డుకున్నట్లు యూఏఈ, ఖాతార్ వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. మూడు బాలిస్టిక్ క్షిపణలను, 129 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించాయని, 121 డ్రోన్లను అడ్డుకోగా, ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయని యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. 10 డ్రోన్లు, రెండు క్రూయిజ్ క్షిపణులతో తమ దేశంపై ఇరాన్ దాడి చేసినట్లు ఖతార్ సైన్యం వెల్లడించింది. వాటన్నింటిని సమర్ధంగా ధ్వంసం చేయగలిగినట్లు పేర్కొంది.
హర్మూజ్ మా అధీనంలోనే: రివల్యూషనరీ గార్డ్స్
హార్మూజ్ జల సంధి పూర్తిస్థాయిలో తమ అధీనంలోనే ఉన్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. తమ అనుమతి లేకుండి ఏ దేశ చమురు నౌకలు అటుగా ప్రయాణించేందుకు వీల్లేదని, లేదంటే దాడులు తప్పబోవని హెచ్చరించింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడులను ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఖండించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది. హక్కుల అతిక్రమణను విచారిస్తోంది. ఏదేని దేశం ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా బల ప్రయోగాన్ని ఐరాస చార్టర్ నిషేధిస్తుందని ఇరాన్‌కు సంబంధించిన ఐరాస స్వతంత్ర అంతర్జాతీయ నిజ నిధారణ మిషన్ ఒక ప్రకటన చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఇరాక్, సిరియా దాటుకొని టర్కీ గగనతలంలోకి ప్రవేశించగా, నాటో వైమానిక రక్షణ వ్యవస్థలు దానిని ధ్వంసం చేశాయని టర్కీ అధికారులు తెలిపారు. ‘ఇరాన్ బాసిల్టిక్ క్షిపణి ప్రయోగించింది. అది ఇరాక్, సిరియా గగనతýం మీదుగా టర్కీ గగనతలంలోకి ప్రవేశించింది. నాటో వైమానిక`క్షిపణి రక్షణ వ్యవస్థలు దానిని గుర్తించి, ధ్వంసం చేశాయి’ అని టర్కీ రక్షణ శాఖ ప్రకటన పేర్కొంది.

The post పోరు…హోరు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *