. గంగవరంలో ఘోర రోడ్డు ప్రమాదం
. ఐదుగురు మృతి
. మృతులు బెంగుళూరు వాసులు
. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.
. అతివేగమే ప్రమాడానికి కారణం
విశాలాంధ్ర – గంగవరం : మండలంలోని వై ఎస్ ఆర్ కూడలి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు కు చెందిన ఓ కుటుంబం బుధవారం ఉదయం తిరుమలకు వెళ్ళుతుండగా మార్గమద్యంలో ప్రమాదం జరిగింది. రోడ్డు పై వెళుతున్న లారిని వెనక భాగంలో కారు దీకోంది. దీనితో ఇందులో ప్రయాణం చేస్తున్న బెంగళూరు కు చెందిన మోహన్ దాస్ 71, నాగరాజు రావు 61, కుసుమ 61, జయంతి 59, పూజ 33లు అక్కడికి అక్కడే మృతి చెందారు. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. కుసుమ, జయంతి అక్కచెల్లలు కాగా పూజ నాగరాజు జయంతిల కుమార్తె. కారు లారీ వెనుక భాగంలో ఇ రక్కు పొగా పోలీసులు ప్రోక్లయిన సహాయంతో శవాలను వెలికి తీయీంచడం జరిగింది. అనంతరం శవాలను పరీక్షల నిమిత్తం పలమనేరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి పరీక్షల అనంతరం మృత దేహాలను మృతుల బంధువులకు అప్పగించినట్లు సీ ఐ రాంభూపాల్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే, మంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు.
ప్రమాద విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే అమరనాధ్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు మృతుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అన్ని ఏర్పాట్లు చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు.
The post అంతా రెప్పపాటులో జరిగిపోయింది appeared first on Visalaandhra.


