ప్రజల మధ్య ఐక్యత… శాంతి, ప్రగతికి చిహ్నం
ఇస్లాం ధర్మం చెప్పేది సమసమాజస్థాపనే: కూనంనేని
విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: మతసామరస్యాన్ని చాటుతూ దేశంలో లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అందుకు ధార్మిక పండుగలు దోహదపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యత ఉన్నప్ప్పుడే శాంతి ప్రగతి సాధ్యమన్నారు. కొన్ని శక్తులు రాజకీయ , ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు… శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రంజాన్ ను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని జామా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిóగా హాజరై మాట్లాడారు. ఉపవాస దీక్ష విరమించిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఖర్జూర పండ్లు తినిపించారు. ఇఫ్తార్ విందు… ప్రజల మధ్య సోదర భావం, ఐక్యతాభావాన్ని పెంచుతుందన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కఠినమైన ఉపవాసాలు పాటించటం ద్వారా సమాజంలోని నిరుపేదల ఆకలి దప్ప్పుల తీవ్రత గుర్తించే వీలు కలుగుతుందన్నారు. ఇస్లాం ధర్మం మానవులంతా సమానులే అనే దృక్పథాన్ని వెల్లడిస్తుందని స్పష్టం చేశారు. సమ సమాజ నిర్మాణం ఇస్లాం ధర్మం కోరుకుంటుందని తెలిపారు. రాగద్వేషాలను దూరం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో కులమతాలకతీతంగా మతసామరస్యాన్ని చాటి చెప్పాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృధ్ధికోసం, తాను చేస్తున్న కృషికి ప్రజలు, అధికారులు సహకరించి మరింతగా ప్రోత్సహించాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా, రాష్ట్ర మైనారిటీ నాయకులు నయీమ్ ఖురేషి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, మేయర్ మూడ్ గణేష్, నయీమ్ ఖురేషి, ఆబిద్ హుస్సేన్, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్ప్పుశెట్టి రాహుల్, విశ్వేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, గౌతమి కృష్ణ, వల్లపు యాకయ్య, వైఎస్. గిరి, రాకేష్, వెంకటరత్నం, కర్రు రమేష్, మస్తాన్, ఆదినారాయణ, దినేష్, రామాచారి, అల్లి వెంకటేశ్వర్లు, బీమా నాయక్,లాల్ పాషా, ఫయాజ్, అభిద్, అక్బర్, మస్తాన్, గౌస్, కృర్షిద్, ముత్తు జాలి, కురిషి, రషీద్, రెహమాన్, గౌస్, అంజాద్ పాల్గొన్నారు.
The post మత సామరస్యం చాటుదాం appeared first on Visalaandhra.


