విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు, పుణ్య దంపతులు తమ్మినేని నరసింహులు, తమ్మినేని రాజకుమారి తమ ఉదారతను చాటుకున్నారు.అనంతపురంలోని ఇస్కాన్ గోశాల నిర్వహణ కోసం వారు రూ.14 లక్షల 17 వేల భారీ విరాళాన్ని అందజేశారు.గోరక్షణ, గోసేవ పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ వారు ఈ ఆర్థిక సాయాన్ని ఇస్కాన్ ప్రతినిధి దామోదర్ గౌరంగ్ ప్రభుదాస్ కు వ్యక్తిగతంగా అందజేశారు.కాగా, ఈ దంపతులు గతంలో కూడా గోశాల అభివృద్ధి కోసం రూ.12 లక్షలను విరాళంగా అందజేయడం గమనార్హం. వీరి సేవా దృక్పథాన్ని, గోశాల పట్ల చూపుతున్న మక్కువను స్థానికులు, ఇస్కాన్ ప్రతినిధులు కొనియాడారు.


