న్యూదిల్లీ: విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రధాన ఉత్పత్తి అయిన సంతూర్, రియల్ చందన లేపనంతో తయారు చేసిన ‘సంతూర్ అగర్బత్తీ’లను విడుదల చేయడం ద్వారా అగర్బత్తీల విభాగంలోకి ప్రవేశించింది. చందనం ఆధారిత ఉత్పత్తులతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, సంతూర్ ఇప్పుడు నూతనంగా గృహ
సుగంధ విభాగంలోకి విస్తరించింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో చందనాన్ని ఉపయోగించడంలో సంతూర్ దశాబ్దాలుగా పేరుగాంచింది. ఈ నూతన ఉత్పాదకథతో,
సంతూర్ తన వ్యాపార వారసత్వ విలువలను అగర్బత్తీల విభాగంలోకి విస్తరిస్తోంది. దేవాలయాలు, ఇళ్లలో సాంప్రదాయకంగా ఉపయోగించే రియల్ చందన్ లేపనంను
ఈ అగర్బత్తీల తయారీలో కీలక పదార్థంగా ఉపయోగించారు. సంతూర్ అగర్బత్తీలు మూడు రకాల్లో అందుబాటులోకి వచ్చాయి. చందన లేపం, చందనం మరియు మల్లె,
చందనం మరియు కేసరి.. ఈ మూడు రకాలను రియల్ చందన్ లేపనంతో రూపొందించారు. ఇది మనకు సుపరిచితమైన సాంప్రదాయ సువాసనలను అందిస్తుంది.
విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ బిజినెస్ డెవలప్మెంట్ జిఎమ్ ఉషాసిస్ సాహా మాట్లాడుతూ రియల్ చందన్ లేపనంతో తయారు చేసిన సంతూర్ అగర్బత్తీలను
పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు.


