న్యూదిల్లీ:భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్తోంది. పశ్చిమాసియాలో ఉద్త్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది. ‘‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు’’ అని సింధు సోషల్ మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్‌పై దాడికి దిగాయి. గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసి వేయడంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీనితో పీవీ సింధు ప్రయాణానికి ఆటంకం కలిగింది. మధ్యలోనే ఆమె ఆగిపోవలసి వచ్చింది.
The post దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న పీవీ సింధు appeared first on Visalaandhra.


