గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవు


కల్తీ పాలు మృతులకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలి

సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో భాదితులను పరామర్శించిన సీపీఐ బృందం

రాజమండ్రి : గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలని అప్పుడే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఇటీవల కల్తీ పాల వల్ల ప్రమాద సందర్భంగా కిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయినా బాధితులు వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 15వ తేదీన కల్తీపాల విషయం ప్రజలు ఆరోగ్య సమస్యలు వచ్చి ఆస్పత్రిలో జాయిన్ అవుతే 19వ తేదీ వరకు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని ఆయన అన్నారు. జిల్లా వైద్యశాఖ నిర్లక్ష్యం తీవ్రంగా కనబడుతుందని ఆయన పేర్కొన్నారు కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేని కారణంగానే ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్నారని పాలకులు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలను ప్రోత్సహిస్తున్నారని నారాయణ తెలిపారు ఏ ప్రభుత్వమైనా గ్రామీణ ప్రాంతాల నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవని ఆయన మరోసారి గుర్తు చేశారు కల్తీ పాల సంఘటనలో మరణించిన వారికి రూ 50 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలు సరిపోదని ఆయన అన్నారు

అనంతరం జిల్లా కలెక్టర్ గారూ, డాక్టర్స్ తో మాట్లాడి ప్రమాద తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటనలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరరావు జిల్లా సహాయ కార్యదర్శి కే రాంబాబు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే సత్తిబాబు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రసాద్ కాకినాడ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *