. డ్రోన్లు, బాంబులతో పరస్పర దాడులు
. 133 మంది అఫ్గాన్ సైనికుల మతి: పాక్
. 55 మంది మరణం: అఫ్గాన్
. ఎఫ్`16 కూల్చినట్లు తాలిబన్ల ప్రకటన
. చైనా, ఇరాన్, రష్యా శాంతి పిలుపు
కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీశాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సరిహద్దుల వద్ద భీకర పోరు కొనసాగుతోంది. అఫ్గాన్‌పై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు పాక్ రక్షణ మంత్రి ఖాజా మహమ్మద్ ఆఫిస్ ‘ఎక్స’లో పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని మూడు ప్రదాన నగరాలపై పాకిస్థాన్ బాంబు దాడులు చేసినట్లు తెలిపారు. అఫ్గాన్ దాడులకు బదులిచ్చినట్లు వెల్లడించారు. తమ సహనం నశిస్తోదంటూ పోస్టు పెట్టారు. తాలిబన్ ప్రభుత్వ రక్షణ శాఖ స్పందిస్తూ పాక్ సైనిక లక్ష్యాలపై డ్రోన్ దాడులు చేసినట్లు వెల్లడిం చింది. పాక్ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ తాలిబన్ తీవ్రవాదులు పాకిస్థాన్‌పై దాడులకు డ్రోన్‌లు వాడారని, వాటిని తమ యాంటీ డ్రోన్ వ్యవస్థలు కూల్చివేశాయని, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. గురువారం రాత్రి అఫ్గాన్ దాడులు చేయగా, పాకిస్థాన్ ప్రతిఘటిం చింది. ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్‌కు ‘గజబ్ లిల్ హక’ అని పేరుపెట్టింది. కాబూల్‌లో మూడు సార్లు పేలుళ్లు జరిగినట్టు తాలిబన్ అధికారులు పేర్కొన్నారు. కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్‌లలో వైమానిక దాడులు జరిగాయని అఫ్గాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. పాక్‌పై దాడుల్లో ఆ దేశానికి చెందిన 55 మంది సైనికులు చనిపోయారని పేర్కొన్నారు. అఫ్గాన్ ప్రకటనను పాక్ తిప్పికొట్టింది. తమ సైనికులు ఇద్దరు అమరులయ్యారని, మరో ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. అఫ్గాన్ సైనికులు 133 మంది తమ దాడుల్లో చనిపోయినట్లు పాక్ అధికార ప్రతినిధి జైదీ వెల్లడించారు. 200 మందికిపైగా గాయపడినట్లు పేర్కొన్నారు. తొమ్మిది మంది సైనికులను నిర్బంధించినట్లు తెలిపారు. తమ గగనతలంలోకి ప్రవేశించిన పాక్‌కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు అఫ్గాన్ ప్రకటించింది. అఫ్గాన్‌కు దీటుగా బదులిస్తున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. దురాక్రమణలను అణచివేస్తామన్నారు. అఫ్గాన్ దాడులకు ప్రతిగా పాక్ వైమానిక దాడులు చేపట్టిన నేపథ్యంలో ‘సూసైడ్ స్క్వాడ’ అంటూ అఫ్గాన్‌లోని బక్తర్ న్యూస్ ఏజెన్సీ ఓ చిత్రాన్ని విడుదల చేసింది. ఆత్మాహుతి బాంబర్ల బెటాలియన్ అని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. పేలుడు సామగ్రితో కూడిన దుస్తులు, కారు బాంబులతో ప్రధాన ప్రాంతాలను లక్ష్యం చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. అయితే, పక్తియా, పక్తికా, ఖోస్ట్ వంటి సరిహద్దు ప్రావిన్సుల్లో పాక్ దాడులను ఎదుర్కొంటున్నామని తాలిబన్ ప్రతినిధి వెల్లడించారు. పాక్ సైనిక స్థావరాలపై అఫ్ఘానిస్థాన్ దాడులతో తాజా ఘర్షణలు చెలరేగాయి. ప్రతీకార దాడుýంటూ తాలిబన్లు సమర్థించుకున్నారు కానీ పాక్ వెంటనే యుద్ధాన్ని ప్రకటించడంతో రెండు దేశాలకు నష్టం వాటిల్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
తక్షణమే రక్తపాతం ఆపండి
అఫ్గాన్, పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొనడాన్ని ఇరాన్, రష్యా, చైనా ఖండించాయి. శాంతికి పిలుపునిచ్చాయి. తక్షణమే చర్చలు జరపాలని హితవు పలికాయి. మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చాయి. ఈ మేరకు ఆయా దేశాలు శుక్రవారం ఎక్స్ మాధ్యమంగా సందేశాలు పంపాయి. రెండు దేశాల మధ్య సహకారం, అవగాహనను పెంపొందించడం కోసం చర్చలకు సహకరించేందుకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పోస్టు పెట్టారు. రష్యా కూడా దాడులు తక్షణమే ఆపాలంటూ అఫ్గాన్, పాక్‌కు పిలుపునిచ్చింది. దౌత్యమార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. యుద్ధం రావడం తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని చైనా వెల్లడించింది. తక్షణమే దాడులు ఆపేలా రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. సంయమం పాటించాలంటూ పాక్, అఫ్గాన్‌కు పిలుపునిచ్చింది. రక్తపాతం ఆపాలని, సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ జరగాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మీడియాకు తెలిపారు. ఆ తమ దౌత్య అధికారులు రెండు దేశాల మధ్య రాజీ కోసం అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారన్నారు.
The post అఫ్గాన్‌పై పాక్ యుద్ధం appeared first on Visalaandhra.


