దక్షిణ భారత చెస్ పోటీలకు ఎంపికైన అనంత మెడికోలు


విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : తమిళనాడు భారతిదాసన్ యూనివర్సిటీలో మార్చ నెల 2వ తేది నుంచి 6వ తేది వరకు జరగనున్న దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల
చెస్ పోటీలకు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు బి. దీపక్ మరియు కె. లోకేష్ నాయక్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తరుపున ద్వితీయ, తృతీయ స్థానము లో ఎంపికై ఈ పోటీలలో పాల్గొనడం కళాశాలకు గర్వకారణమని, చెస్ లో క్రీడాకారులు అద్భుత ఆటతీరు కనబరచడం వలన యూనివర్సిటీకి ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం. విజయ్ శ్రీ తెలిపారు. అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలలో కూడా ఇదే రకంగా మంచి ప్రతిభ కనబరిచి దక్షిణ భారతదేశంలోని ఉత్తమ ఆటగాళ్లు అవార్డులు సాధించుకురావాలని ఉత్సాహాన్ని నింపి అభినందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.నరసింహ నాయక్, తదితరులు మాట్లాడుతూ మా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయశ్రీ గారు వైద్య విద్యార్థులు చదువుతోపాటు ఆటలలో కూడా బాగా రాణించాలన్న ఉద్దేశంతో మంచి వసతులు సమకూర్చి, వారిని ప్రోత్సహించడం వలన మునిపెన్నడూ లేనంతగా వైద్య విద్యార్థులు క్రీడలలో కూడా రాణిస్తున్నారని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *