ఘనంగా రోటరీ 121 వజన్మదిన ఉత్సవాలు.. రోటరీ క్లబ్


విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సాంస్కృతిక మండలి లో రోటరీ క్లబ్ 121వ జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్ ప్రతినిధులు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తొలుత కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి నరేందర్ రెడ్డి, తదితర సీనియర్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ 1905 ఫిబ్రవరి 27న అమెరికాలోని చికాగోలో యూనిటీ బిల్డింగ్స్ లో నలుగురు వ్యక్తులు సమాజసేవయే దృక్పతంగా స్థాపించిన సంస్థ ఇది అని, అంచెలంచెలుగా ఎదుగుతూ పోయి నేడు ప్రపంచంలోని రెండు వందల దేశాలలో విస్తరించి దాదాపుగా 32 వేల క్లబ్బులు స్థాపింపబడి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నేడు ప్రపంచంలో పోలియో వ్యాధి 99.5 శాతము నిర్మూలించబడినదనగా కారణం రోటరీ ఇంటర్నేషనల్ మాత్రమే అని వాళ్ళు గుర్తు చేశారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో వ్యాధిగ్రస్తుల నుండి కాపాడబడుతూ యుద్ధములు జరిగినప్పుడు అక్కడ నిరాశృతులను వారికి ఆశ్రయాలు ఆహార పదార్థాలు , మందులు అందిస్తూ శాంతిస్థాపనకై ఎంతో కృషి చేస్తోంది అని తెలిపారు. అంతేకాక తల్లి పిల్లల ఆరోగ్యం పరిశుభ్రమైన మంచినీటి సౌకర్యం నిరక్షరాస్యత నిర్మూలన వంటి ఎన్నో పథకాలపై వాటి సేవలపై దృష్టి సారీస్తుందని తెలిపారు
రాబోవు 10 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతను సాధించాలని క్యాన్సర్ వంటి రోగాలపై వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయాలని నిర్ణయించుకుంది అని తెలిపారు. రోటరీ క్లబ్ ధర్మవరం కూడా 1994లో ప్రారంభించి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది అందులో భాగంగా పోలియో నిర్మూలనతోపాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలపై హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ దాదాపుగా 36,500 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు నిర్వహించి ,అందరికీ సరైన చూపును ప్రసాదిస్తూ, ఎందరికో అందత్వం కలిగిన వారికి స్వర్గస్తులైన వారి నుండి కళ్ళు దానం చేయించి చూపును ప్రసాదించడం జరిగింది అని తెలిపారు. క్లబ్ చేస్తున్న సేవలను మీడియా వారు కూడా ప్రజలకు తెలియజేస్తూ తమకు సహాయ సహకారాలు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *