విశాలాంధ్ర – జూబ్లీహిల్స్ : జూబ్లిహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబర్ 36లో మంగళగౌరి షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పాటు ప్రాంతమంతా భారీగా పొగలు వ్యాపించాయి. పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తాయని భయాందోళనలో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు కానీ ఫైర్ సిబ్బంది తక్షణ చర్యతో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు.. షాప్ ముందు ఏర్పాటు చేసిన టెంపుల్ సెట్ షార్ట్ సర్య్కూట్ ఇంకా వెల్డింగ్ పనులు చేయడంతో ఒక్కసారిగా నిపు రవలు పిఓపి కి అంటుకోవడం తో అగ్ని ప్రమాదం క్షణాలలో భవనమంతా అంటుకుంది. అదృష్టవశాత్తు చీరల షాపులో ఎలాంటి సరుకులు లేకపోవడం, మంగళ గౌరీని సారీ షోరూం ను రేనోవేషన్ చేసే పనుల్లో భాగంగా అంతా సామాగ్రిని ముందే తరలించడంతో, ఎలాంటి ఆస్తి నష్టం గాని, ప్రాణా నష్టం గాని సంభవించలేదు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎస్ హెచ్ ఓ యూ. శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించి పరిస్థితిని అది త్వరలో అదుపు చేసి, ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా ట్రాఫిక్ సిబ్బందితోపాటు లా & ఆర్డర్ పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


