విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు బండి ఆంజనేయులు వారి జ్ఞాపకార్థం కుమారుడు బండి వేణుగోపాల్ వ్యవహరించడం జరిగిందన్నారు. మొత్తం 65 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 45 మందికి కంటి ఆపరేషన్కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వేలాదిమందికి కంటి ఆపరేషన్ లతో పాటు ఉచితంగా అద్దాలను కూడా నిరంతరం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ పూజారి జాహ్నవి కిమ్స్ సవేరా హాస్పిటల్ అనంతపురం నుంచి రావడం జరిగిందన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శరీర భాగాలలో అతి సున్నితమైన ప్రధానమైన కంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని తెలిపారు. కంటి రక్షణ కూడా ఎంతో అవసరమని వారు తెలిపారు. అనంతరం డాక్టర్లు కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు వెంకటస్వామి, జోనల్ చైర్మన్ వేణుగోపాలాచార్యులు, మోహన్ దాస్, మెటీకల కుల్లాయప్ప, గోశే రాధాకృష్ణ, పళ్లెంవేణుగోపాల్, పుట్లూరు నరసింహులు, డాక్టర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


