స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ హెడ్మాస్టర్ సుమన
విశాలాంధ్ర ధర్మవరం:: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు ఇటీవల నిర్వహించినటువంటి సైకిల్ రేసులో జిల్లా స్థాయికి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు రాణించి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమనా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు గాను ఫిబ్రవరి 28 నుండి మార్చి ఒకటి వరకు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ చూపాలని వారు తెలిపారు. అలానే విద్యార్థినీలకు క్రీడారంగంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగించి మీ ఉజ్జలమైన భవిష్యత్తును ఎన్నుకోవాలని తెలిపారు. విద్యార్థినీలు క్రీడల్లో బాగా రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో క్రీడా సర్టిఫికెట్ 3 శాతము రిజర్వేషన్ ఉండడం వలన చాలా ఉపయోగం పడుతుంది అని, అలానే ఆరోగ్యంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడం కూడా జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, పిడి స్వరూప, సరళ, జూడో ఎన్ ఐ ఎస్ కోచ్ ఇనాయత్ భాషా , తోటి విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.


