మరోసారి భారత్‌ పై ట్రంప్‌ టార్గెట్


-సోలార్ ఉత్పత్తులపై 126 శాతం డ్యూటీ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. మన దగ్గరి నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126 శాతం డ్యూటీ విధించారు. ఇండోనేసియాపై ప్రాథమిక సుంకాలను 86 శాతం నుంచి 143 శాతానికి పెంచారు. లావోస్‌పై 81 శాతం డ్యూటీ వేశారు. ఫారెన్‌ సబ్సిడీల ఆధారంగా రేటును నిర్ధరించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ మూడు దేశాల నుంచి అగ్రరాజ్యానికి దిగుమతి అవుతోన్న సెల్స్‌, ప్యానెల్స్‌ వంటి సోలార్ దిగుమతుల విలువ 4.5 బిలియన్ డాలర్లని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తమ సోలార్ ఉత్పత్తులపై ఈ దేశ ప్రభుత్వాలు అసంబద్ధ రీతిలో సబ్సిడీలు ఇస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. అమెరికా ఫస్ట్ విధానానికి ట్రంప్‌ తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి తాపత్రయపడుతున్నారు. ఈ అధిక డ్యూటీ కారణంగా అమెరికా వినియోగదారులు సోలార్‌ దిగుమతులపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. ప్రపంచ దేశాలపై ఇప్పటికే ట్రంప్ ఎడాపెడా విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ డ్యూటీ విధింపు ప్రాధాన్యం సంతరించుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *