-ఆకట్టుకున్న సంప్రదాయ కళాకారుల నృత్యాలు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గవిమఠం శ్రీస్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అడ్డపల్లకి-గ్రామోత్సవం వైభవంగా జరిగింది. పట్టణంలోని వెలిగొండ రహదారిలో ఉన్న విడిది మఠంలో పీఠాధిపతికి గవిమఠం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్, అర్చకులు ప్రత్యేక పాదపూజ నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వాముల వారిని పల్లకిలో కూర్చోబెట్టి పురవీధుల గుండా మేళా తాలాలు, సంప్రదాయ నృత్యాల నడుమ ఘనంగా ఉరేగించారు.ఈ సందర్భంగా కళాకారుల శివ… అమ్మవారి తాండవాలు, వీరభద్ర వేషదారి నృత్యం పలువురిని ఆకట్టుకుంది..డప్పు వాయిస్తూ కళాకారులి చేసిన నృత్యాలు చూపరులను కట్టిపడేసాయి. ఈ ఉత్సవంలో గవిమఠం గజలక్ష్మి (ఏనుగు) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల సంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర స్వామి, ఆదోని చౌకి మఠం పీఠాధిపతి కల్యాణి స్వామి, మఠం ఏజెంట్ రాజన్న గౌడ్ ,మఠం సిబ్బంది శంకర, గోపి, నారాయణస్వామి, మధు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The post వైభవంగా ‘అడ్డపల్లకి’ గ్రామోత్సవం.. appeared first on Visalaandhra.


