సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే..


సంస్థ చైర్మన్ నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;; సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లయోలా పాఠశాల పక్కన గల కృష్ణ చైతన్య మండలిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన దూలప్ప విచ్చేశారు. అనంతరం తలం నారాయణమూర్తి జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా పట్టణంలో మా స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, దాతల సహాయ సహకారములతోనే ఈ కార్యక్రమం విజయవంతం కావడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. ఉత్తమ అలవాట్లు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండవలసిన బంధం ఎంతో ముఖ్యమైనదని వారు తెలిపారు. సమాజ హితము కోరే వ్యక్తి మంచి వక్త అయినటువంటి దూలప్ప ఈ కార్యక్రమానికి రావడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంజునాథ్, కోశాధికారి చంద్రశేఖ, డైరెక్టర్లు రామకృష్ణ, ప్రతాపరెడ్డి, రవికుమార్, 25 మంది పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *