ఆర్బిఎస్కే డీఈఐసీ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ ఎస్. బి. విష్ణుమూర్తి


విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆర్బిఎస్కే డీఈఐసీ (డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్),ను మంగళవారం ప్రోగ్రామ్ అధికారి డా. ఎస్. బి. విష్ణు మూర్తి సందర్శించి, కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించి వైద్య సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు.
జాతీయ నులి పురుగుల దినోత్సవం మాప్ అప్ కార్యక్రమం సందర్భంగా డీఈఐసీ కేంద్రానికి వచ్చిన ఫాలోఅప్ కేసులకు అల్బెండాజోల్ 400 మి.గ్రా మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు లబ్ధి పొందారు.
అదేవిధంగా, జాతీయ నులి పురుగుల దినోత్సవం మాప్ అప్ కార్యక్రమం సందర్భంగా శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మొత్తం 1231 మంది విద్యార్థులకు గాను ఈ రోజు 51 మందికి అల్బెండాజోల్ 400 మి.గ్రా మాత్రలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రోగ నిరోధక అధికారి డా. నాగ శశిభూషణ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

The post ఆర్బిఎస్కే డీఈఐసీ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ ఎస్. బి. విష్ణుమూర్తి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *