హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ పైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన bస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొత్తగా వ¶డు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకుంది. బీమాను అందరికీ అందుబాటులోకి తేవడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాల అవసరాలకు అనుగుణమైన ఆర్థిక పరిష్కార మార్గాలను అందించడంపై కంపెనీకి గల చిత్తశుద్ధికి ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది. కొత్తగా భూపాలపల్లి, ఖమ్మం జిల్లా బుర్హాన్‌పురం, నాగర్‌కర్నూల్‌లలో ప్రారంభించారు. bస్‌బీఐ లైఫ్ రీజనల్ మేనేజర్ (రిటైల్ ఏజెన్సీ) వంశీధర్ రెడ్డి, bస్‌బీఐ లైఫ్ డీఆర్bం (రిటైల్ ఏజెన్సీ) bప్పా రవీందర్, bస్‌బీఐ లైఫ్ డీఆర్bం (రిటైల్ ఏజెన్సీ) శ్రీనివాస్ కూర్మల ఇతర ప్రముఖుల సమక్షంలో bస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ డైరెక్టర్ (తెలంగాణ) అభిషేక్ కర్ మజుందార్ ఈ శాఖలను ప్రారంభించారు. ఈ కొత్త శాఖలతో తెలంగాణలో bస్‌బీఐ లైఫ్ శాఖల సంఖ్య 56కి చేరినట్లవుతుంది. ప్రాంతీయంగా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత పటిష్టమవుతుంది. కార్యకలాపాలు మరింత విస్తతం అవుతాయి. కస్టమర్లకు సౌకర్యవంతంగా, నిరాటంకమైన మద్దతు ఉండేలా పాలసీల జారీ, ప్రీమియం వసూళ్లు, పాలసీ సర్వీసిం>ù, క్లెయిమ్స్‌పరమైన సహాయం మొదలైన సమగ్ర సర్వీసులన్నీ కొత్త శాఖల్లో లభిస్తాయి.


