టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ
విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో పాడి రైతుల అభివృద్ధి కోసం టి.డి.పి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు, టీడీపీ మండల
ఇంచార్జి ధర్మవరపు మురళీ అన్నారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద రూ.2.30లక్షల అంచనా వ్యయం ఉండగా 90శాతం సబ్సిడీతో కుమ్మర మల్లికార్జున, సుబ్బరత్నమ్మ దంపతులు నిర్మించుకున్న గోకులం షెడ్డును సోమవారం అయన డ్వామా విజిలెన్స్ అధికారి జల్లా శ్రీనివాసులు, ఎంపీడీఓ బి.విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓలు అశోక్ బాబు, అచ్యుతానందబాబు, మండల కన్వీనర్ పంపు కొండప్ప, సర్పంచ్ సాకే తిరుపాలుతో కలిసి ప్రారంభించారు.
మురళీ మాట్లాడుతూ గోకులం షెడ్లు పశువులకు రక్షణ, పాల ఉత్పత్తిని పెంచడానికి, మూగజీవాలకు నీడ, వాన, ఎండ నుండి రక్షణ కల్పిస్తూ పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఏపీఓ సావిత్రి, ఈసీ మురళీ, టెక్నికల్ ఫీల్డ్ అసిస్టెంట్లు హజారా, తలారి శివ, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


