మెడికల్ మాఫియా పై చర్యలు చేపట్టండి..


శ్రీ సత్య సాయి జిల్లా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి సకల రాజా
విశాలాంధ్ర ధర్మవరం:: మెడికల్ మాఫియా పై తగు చర్యలు గైకొనాలని కోరుతూ డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి కు వినతి పత్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియాఅక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు.జిల్లాలో ఇటీవలి కాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ , కొంతమంది మెడికల్ స్టోర్లు ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ ధనార్జనమే లక్ష్యం గా పనిచేస్తున్నాయి అని తెలిపారు.పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ఈ ప్రైవేట్ ఆసుపత్రులు
ప్రజారోగ్యాన్ని సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి దోపిడీకి పాల్పడడం రుణమన్నారు.పేద,మధ్యతరగతి కుటుంబాల బలహీనతను ఆసరాగా చేసుకుని అవసరానికి మించిన బిల్లులు వేయడం, అవసరం లేని పరీక్షలు,చికిత్సలు చేయించడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు అని తెలిపారు.ఇక మరోవైపు, జిల్లాలో కొంతమంది మెడికల్ స్టోర్లు చట్టాలను పక్కనబెట్టి ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందుల విక్రయం, అనుమతి లేని అబార్షన్ మాత్రల రహస్య అమ్మకాలు, లైసెన్స్ లేకుండా మెడికల్ షాపుల
నిర్వహణ వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు అని తెలిపారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందుల విక్రయాలను వెంటనే నిలిపివేయాలి అని, అనుమతి లేని అబార్షన్ మాత్రల అమ్మకాలపై క్రిమినల్
కేసులు నమోదు చేయాలి అని, లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లను తక్షణమే సీజ్ చేయాలి అని,అన్ని మెడికల్ షాపులు ,ప్రైవేట్ హాస్పిటల్స్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి అని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైనచర్యలు తీసుకోవాలి అని, వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నవీన్, అజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *