భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర


27న విశాఖ నుంచి ప్రారంభం

  • ఐ ఆర్ సి టి సి జాయింట్ జిఎం కిషోర్
    విశాలాంధ్ర-ఆముదాలవలస ( శ్రీకాకుళం) : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ గమ్యస్థానాల గుండా ఆధ్యాత్మి కంగా ఉత్తేజపరిచే యాత్రను ఐ ఆర్ సి టి సి ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా విశాఖపట్నం నుంచి ఈనెల 27న భారత్ గౌరవ యాత్ర పేరిట ప్రారంభించనున్నట్లు టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డి ఎస్ జి పి కిషోర్ తెలిపారు. ఈనెల 27న విశాఖప ట్నంలో ప్రారంభమై ఎనిమిది రాత్రులు 9 పగళ్ళు ప్రయాణం చేసి ముఖ్య పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు తెలిపారు. అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం తో దివ్య దక్షిణ యాత్ర అనే పేరుతో ప్రత్యేకంగా రూపొందించినట్లు. యాత్రలో ప్యాకేజీ టూర్ ఒక్కో వ్యక్తికి 14700/- ఐదు నుండి పది సంవత్సరాలు లోపు చిన్నా రులకు 13800/- రూపాయలు ఉంటుందని వివరించారు. కాంచీ పురం, రామేశ్వరం, మహాబలిపురం, మధురై, తిరుచి, తంజా వూర్, తిరువన్నామలై ప్రాంతాల్లోని కామాక్షి అమ్మ, తీర దేవాల యం, రామనాథ స్వామి, మీనాక్షి అమ్మ, శ్రీ రంగనాథ స్వామి, బృహదీశ్వర ఆలయం, అరుణాచలం ఆలయం వంటి పుణ్యక్షే త్రాలను దర్శించునున్నట్లు వివరించారు. ఈ యాత్ర 27న ప్రారం భమై మే 4వ తేదీన విశాఖపట్నం చేరుకుంటారని అన్నారు. స్లీపర్ క్లాస్ వసతితోపాటు భోజన సౌకర్యాలు, రోడ్డు రవాణా హోటల్ వసతి వంటి అంశాలను ప్యాకేజీలో చేర్చబడినట్లు వివరించారు. వృత్తిపరమైన మరియు స్నేహపూర్వక ఎస్కార్ట్ సేవలు, రైల్లో భద్రత అవసరమైన సహాయం కోసం ఐ ఆర్ సి టి సి మేనేజర్లు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రయాణపు టికెట్ బుకింగ్ గాని ఇతర వివరాలకు సంబంధిత 9281030748, 92814 95847, 9281495837, 9550166168 నంబర్లను సంప్రదిం చాలని కోరారు. ఆన్లైన్ బుకింగ్ కోసం ఐ ఆర్ సి టి సి వెబ్సైటు సంప్రదించాలని తెలిపారు. ఎప్పుడో భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ ఆధునిక సౌకర్యాలతో రేవంతమైన ప్రయాణ అనుభవాన్ని అంది స్తుందని అన్నారు. దివ్య యాత్రలో పాలుపంచుకొని భారతదేశ ఆధ్యాత్మిక సారాన్ని ఆస్వాదించాలని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *