పుస్తకాలు లేకుండా చదువు.. పలమనేరు లో కొత్త తరహా ప్రీ స్కూల్ ప్రారంభం..! Future On Preschool Palamaner | చిత్తూరు వార్తలు (Chittoor News)


పలమనేరు లో ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్ ఫ్రాంచైజీ ప్రారంభం, జర్మన్ టెక్నాలజీ ఆధారిత ప్లే బేస్డ్ విద్య, ఏప్రిల్ 20 నుంచి సమ్మర్ క్యాంప్, జూన్ నుంచి రెగ్యులర్ క్లాసులు.

ఇప్పటివరకు ఫ్రాంచైజీ అంటే టీ స్టాల్స్, సూపర్ మార్కెట్లు, ఫుడ్ అవుట్‌లెట్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ విద్యా రంగానికీ విస్తరించింది. పలమనేరు పట్టణంలో కొత్తగా ప్రారంభమైన “ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్” ఈ మార్పుకు నిదర్శనం. జాతీయ రహదారిపై కెనెరా బ్యాంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ ప్రీ స్కూల్, జర్మన్ టెక్నాలజీ ఆధారంగా చిన్నారులకు వినూత్న విద్యను అందించబోతోంది.

+

పలమనేరు

పలమనేరు పట్టణంలో జర్మన్ టెక్నాలజీతో విద్యా వ్యవస్థ ప్రారంభం కానీ వీరికి మాత్రమే.

పలమనేరు పట్టణానికి చెందిన రాచమడుగు మౌనిక ఈ ఫ్రాంచైజీని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న ఆమె, తన కూతురిని జర్మనీలోని ఇదే విధమైన స్కూల్‌లో చేర్పించి అక్కడి విద్యా విధానాన్ని దగ్గరగా చూసారు. కొద్ది రోజుల్లోనే తన పిల్లలో వచ్చిన మార్పులు చూసి ఆశ్చర్యపోయిన మౌనిక, ఇదే విధానం మన ప్రాంతంలో కూడా అందించాలని సంకల్పించి ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాకారం చేశారు.

ఈ ప్రీ స్కూల్‌లో ప్లే గ్రూప్స్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, డే కేర్ వంటి తరగతులను ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు పుస్తకాలపై ఆధారపడని విద్యా విధానం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఆటలతో నేర్పడం, ప్రాక్టికల్‌గా మాట్లాడించడం, రియల్ లైఫ్ అనుభవాలతో పాఠాలు చెప్పడం ద్వారా చిన్నారులలో చురుకుదనం, ఆత్మవిశ్వాసం పెంచేలా ఈ విద్యా విధానం రూపొందించబడింది.

మొదటగా సమ్మర్ క్యాంప్‌తో ప్రారంభించి, తర్వాత పూర్తి స్థాయి అకాడమిక్ తరగతులను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 30 వరకు సమ్మర్ క్యాంప్ జరుగుతుండగా, జూన్ నెల నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ విధానం ద్వారా పిల్లలు చదువును భయంగా కాకుండా ఆనందంగా స్వీకరిస్తారని భావిస్తున్నారు.

ఈ ఫ్రాంచైజీ ప్రారంభం ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదగా జరగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. పలమనేరు వంటి ప్రాంతంలో ఇలాంటి ఆధునిక విద్యా సంస్థ ప్రారంభం కావడం స్థానికులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

ఫ్రాంచైజీ వివరాల ప్రకారం, అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షలు కాగా, పూర్తి సదుపాయాలతో తరగతులు నడపడానికి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తిరుపతికి చెందిన దిలీప్ కుమార్ ఈ ఫ్రాంచైజీ యజమాని. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 50కు పైగా శాఖలు ఉన్న ఈ స్కూల్, ఇప్పుడు పలమనేరు లో కూడా ప్రారంభమవడం విశేషం. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *