ఆర్డీటీ స్పెషల్ స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి


రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున

​విశాలాంధ్ర – రాప్తాడు: పదవ తరగతి పూర్తి చేసి పైచదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్డీటీ సంస్థ అండగా ఉంటుందని రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున శనివారం ఒక ప్రకటనలోతెలిపారు. సంస్థ ప్రకటించిన ‘స్పెషల్ మరియు సెమీ స్కాలర్‌షిప్‌ల’ వివరాలను వెల్లడించారు. స్టేట్ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో 520 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రెండు రకాల స్కాలర్‌షిప్‌లకు, ప్రైవేట్ పాఠశాలల్లో 550 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు సెమీ స్కాలర్‌షిప్‌కు అర్హులని పేర్కొన్నారు. సి.బి.ఎస్.ఇ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో 430, ప్రైవేట్ పాఠశాలల్లో 450 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించినట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ఆర్డీటీ ప్రాజెక్టు ఏరియా పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల మార్కులతో పాటు వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేస్తామని వివరించారు. నెలకు రూ. 15,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులని, దరఖాస్తుదారులు తప్పనిసరిగా వేతన ధృవీకరణ పత్రం సమర్పించాలని కోరారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

The post ఆర్డీటీ స్పెషల్ స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *