పిన్నధరిలో అంగరంగ వైభవంగా వనభోజనాల మహోత్సవం..


తాడిమర్రి, విశాలాంధ్ర: మండల పరిధిలోని పిన్నధరి గ్రామంలో బుధవారం వనభోజనాల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటల సమయంలో గ్రామస్థులంతా కలిసి గ్రామాన్ని ఖాళీ చేసి శ్రీ రామస్వామి, అతకల్లప్ప స్వామి విగ్రహాలను ఊరి బయటకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర శర్మ స్వామి ఆధ్వర్యంలో రామాయణ పురాణాలను భక్తులకు వినిపించారు. అనంతరం గ్రామస్థులు తమ బంధువులతో కలిసి ఆనందంగా వనభోజన కార్యక్రమాన్ని జరుపుకున్నారు.శ్రీరామనవమి పండుగ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఇక గురువారం పారువేట కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *