విశాలాంధ్ర ` ఎమ్మిగనూరు రూరల్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిదిలోని ó గుడికల్ గ్రామంలో దర్గా వద్ద జరుగుతున్న ఊరుసుకు వచ్చి కర్నాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన ఒక చిన్నారి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతు అయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఉదయం చెరువు వద్దకు స్నానంకు వెళ్ళిన తల్లికూతురు తల్లి రజియాబేగం, కుమార్తె అఫ్రిన్‌లు ప్రమాదవ శాత్తు చెరువులో పడ్డారు. ఇది గమనించిన అక్కడి స్థానికులు తల్లిరజినాను కాపాడగా కుమార్తె అఫ్రిదీ చెరువులో గల్లంతు అయింది.స్థానికులు, పోలీసులు చిన్నారి మృత దేహం కోసం చెరువులో గాలిస్తున్నారు.
The post చెరువులో చిన్నారి గల్లంతు appeared first on Visalaandhra.


