వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన అసెంబ్లీ – Visalaandhra
. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనంటూ విమర్శలు. అనంతరం వాకౌట్ చేసిన సభ్యులు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలతో శాసన సభ దద్దరిల్లింది. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరు అనే ప్లకార్డును పట్టుకుని ఆయన తన పార్టీ సభ్యులతో సభకు హాజరయ్యారు. ఉభయసభల నుద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్…


