అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా…


