నార్పలలో ఘనంగా బక్రీద్ వేడుకలు – భక్తిశ్రద్ధలతో ఈద్-ఉల్-అధా…..


విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండలంలో ముస్లిం సోదరులు బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరై ప్రత్యేక ఈద్ నమాజులు నిర్వహించారు.నమాజుల సందర్భంగా దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐకమత్యం మరియు సుఖసంతోషాలు నెలకొనాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. ప్రార్థనలు అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నారులు, యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఆనందమయం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నార్పల ఎస్‌ఐ సాగర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈద్గా పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రార్థనలు ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు. మొత్తం వేడుకలు ప్రశాంత వాతావరణంలో, సోదరభావం మరియు ఐకమత్యం మధ్య విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సాగర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ దేవానంద, కానిస్టేబుల్ హరినాథ్ రెడ్డి , నాయక్ తదితరులు పాల్గొన్నారు.

The post నార్పలలో ఘనంగా బక్రీద్ వేడుకలు – భక్తిశ్రద్ధలతో ఈద్-ఉల్-అధా….. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *