విశాలాంధ్ర, యాడికి: యాడికి మండల పరిధిలోని రాయలచెరువు గ్రామంలోని నగరూరు రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అడగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆయన తలకు, కాలికి బలమైన గాయాలు అయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన అడగయ్యను రాయలచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రభుత్వ వైద్యాధికారి అప్పయ్య ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ ద్వారా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.


