పాఠశాలల అక్రమ అడ్మిషన్లు, పుస్తకాల దోపిడీపై డీఈఓ కు వినతి..


ఎస్ఎఫ్ఐ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు, ముందస్తు ప్రచారాలు నిర్వహిస్తూ, పుస్తకాలు, యూనిఫారాలు, షూస్ పేరుతో తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు అక్రమంగా పట్టణంలోని పలు పాఠశాలలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రచారాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ శ్రీ సత్య సాయి జిల్లా విద్యాశాఖాధికారి DEO కిష్టప్ప న ధర్మవరం పట్టణంలో ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విచ్చేసిన వారికి వినతిపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున మాట్లాడుతూ
ధర్మవరం పట్టణంలోని పలు పాఠశాల యాజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికారికంగా విద్యాసంవత్సరం ప్రారంభించక ముందే, నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ల పేరుతో బోర్డులు పెట్టి ప్రచారాలు సాగిస్తూ, విద్యాశాఖ ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలలో పుస్తకాల కిరాణా దుకాణాలను నిషేధించాలి* బయట మార్కెట్ ధర కంటే రెండు, మూడు రెట్లు అధిక ధరలకు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ మరియు బెల్టు, పరీక్ష ప్యాడు డైరీ వగైరా వగైరా స్పెషల్ తరగతికి సంబంధించిన పుస్తకాలు అంటూ వేలాది రూపాయలు దండుకుండే ఈ పుస్తకాల వ్యాపారం ద్వారా ఒక్కో విద్యార్థి తల్లిదండ్రుల నుండి రూ. 15వేల నుండి 20 వేల వరకు అక్రమంగా గుంజుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్కూళ్లలోనే వస్తువులు కొనాలని, చెబుతున్నారు , లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, దామోదర్ పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *