‘TDP హయాంలోనే బాబాయ్ హత్య జరిగింది’.. వైఎస్ వివేకా మరణంపై జగన్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయం చేస్తూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ys jagan
ys jagan

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అత్యంత దారుణమైన, అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతాన్ని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దారుణంగా వాడుకుంటున్నాయని జగన్ మండిపడ్డారు. సొంత కుటుంబంలో జరిగిన ఒక ఘోర విషాదాన్ని పదేపదే ప్రస్తావిస్తూ శవ రాజకీయం చేయడం చంద్రబాబు నైజమని ఆయన దుయ్యబట్టారు. తన బాబాయ్ మరణించిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నారని, ఆ సమయంలోనే ఆధారాలన్నింటినీ తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జగన్ అన్నారు.

నిజమైన శవ రాజకీయాలు చంద్రబాబువే: జగన్

రాజకీయ గురువు సీనియర్ ఎన్టీఆర్ నుండి టీడీపీని లాక్కుని ఆయన మరణానికి కారణమైంది చంద్రబాబేనని వైఎస్ జగన్ మండిపడ్డారు. హరికృష్ణ శవం వద్ద కేటీఆర్‌తో పొత్తులపై మాట్లాడిన బాబువే నిజమైన శవ రాజకీయాలని ఆయన ధ్వజమెత్తారు.

వంగవీటి రంగా ఒక టైగర్..

విజయవాడ ప్రజల గుండెల్లో ‘టైగర్’గా నిలిచిన వంగవీటి మోహన రంగారావు (రంగా) హత్య ఉదంతాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రంగా దీక్ష చేస్తుంటే, టీడీపీ హయాంలోనే అర్థరాత్రి ఆయనను అత్యంత దారుణంగా హత్య చేశారని జగన్ ఆరోపించారు. రంగాను పొట్టనబెట్టుకున్న ఆ ఘోర హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబుకు చంద్రబాబు రాజకీయంగా ఆశ్రయం కల్పించారని ధ్వజమెత్తారు. నిందితుడికి ఏకంగా అసెంబ్లీ టికెట్ ఇచ్చి చంద్రబాబు ఎమ్మెల్యేను చేశారని, టీడీపీ హయాంలోనే ఇటువంటి దారుణ హత్యలు జరిగాయని జగన్ నిప్పులు చెరిగారు.

అమరాతిపై జగన్ ఏమన్నారంటే..

అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం సాగుతోందని ఈ సందర్భంగా జగన్ ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్ల వెనుక దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి, స్కామ్ దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తన బినామీలకు, సన్నిహితులకు అనుకూలంగా ప్లాట్లను కేటాయిస్తూ సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము ప్రతిపాదించిన మూడు రాజధానుల వికేంద్రీకరణ మోడల్ (మవిగన్) ఎంతో పొదుపైనదని, రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అభివృద్ధి చేసే వీలుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాల నుండి దృష్టి మళ్లించడానికి చంద్రబాబు ఇలాంటి శవ రాజకీయాలు, అమరావతి డ్రామాలకు తెరతీస్తున్నారని జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, కక్షసాధింపు చర్యలను ప్రజల ముందు ఎండగడుతూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *