Andhra News: ఏపీలో సంచలనం.. ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపి డ్రమ్ములో పెట్టాడు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో కలిసి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని, నిందితుడిని వదిలిపెట్టబోమని తెలిపారు.

Madanapalle Child Murder Case
Madanapalle Child Murder Case

Madanapalle Child Murder Case: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో చోటుచేసుకున్న బాలిక హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కుదిపేసిన ఈ దారుణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి చట్టపరంగా అత్యంత కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో కలిసి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని, నిందితుడిని వదిలిపెట్టబోమని తెలిపారు.

ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని నీరుగుట్టవారిపల్లిలో జరిగింది. అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహం ఆమె ఇంటికి ఎదురుగా నివసించే వ్యక్తి ఇంట్లో లభించడంతో కలకలం రేగింది. బాలికపై దారుణంగా దాడి చేసి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే దాచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై గతంలోనూ అసభ్య ప్రవర్తన ఆరోపణలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఘటన బయటపడిన తర్వాత గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి పరిసరాల్లో నిరసనలు చేపట్టారు. మదనపల్లి చుట్టు పక్కాల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన హోం మంత్రి అనిత నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బెయిల్‌ రాకుండా చూడటమే కాకుండా త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కేసు దర్యాప్తు పురోగతిని సమీక్షించేందుకు రాయలసీమ పరిధి డీఐజీ కోయ ప్రవీణ్ ఘటనాస్థలికి చేరుకుని స్థానిక పోలీసులతో చర్చించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

బాలిక మృతదేహాన్ని భారీ భద్రత మధ్య మదనపల్లి ప్రభుత్వాసుపత్రికు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ప్రజలు, సామాజిక సంస్థలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై ప్రభుత్వం, పోలీసులు వేగంగా చర్యలు తీసుకుంటుండగా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *