విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడు మండల మెజిస్ట్రేట్ మరియు తహశీల్దార్ పి. విజయకుమారిని శనివారం రాప్తాడు అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ సి. వెంకటేశులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఐ ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మండలంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలోనూ, రెవెన్యూ పరంగా ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించేందుకు రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఇరు శాఖల అధికారులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


