కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని (డిశ్చార్జ్ పిటిషన్), అలాగే ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే… గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫోర్జరీ పత్రాలతో ఆరోపణలు చేశారన్నదే ఈ కేసు ప్రధానాంశం. అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును విచారిస్తున్న కోర్టు ప్రాంగణం నుంచే కీలకమైన పత్రాలు, సాక్ష్యాలు చోరీకి గురవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఉదంతంపై అప్పట్లో హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందిస్తూ, ఈ కేసు విచారణను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *