2023 పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు
ఆ బిల్లు లోని డీలిమిటేషన్ తో ముడిపెట్టిన అంశాన్ని సవరణ చేయాలి …
అమరావతి రాజధాని నీ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేయాలి…
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదని నూతనంగా తీసుకువచ్చినటువంటి దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రపూరిత బిల్లుకు వ్యతిరేకమని, దానితోపాటు డిలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకమని సిపిఐ అనంతపురం జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దొంగ చాటున మహిళా రిజర్వేషన్ బిల్లు సా కు చూపి డి లిమిటేషన్ బిల్లు లో దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలు హిందీ ప్రాంత ఆధిపత్యం క్రింద బానిస జీవితం గడపాలని, కుట్రపూరితంగా బిల్లు పాస్ చేయించుకోవాలన్నటువంటి బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 లోనే పార్లమెంట్లో చట్టాన్ని తీసుకువచ్చారు.కానీ కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకు వచ్చినటువంటి బిల్లులో డి లిమిటేషన్ తో ముడిపెట్టిన ఉన్నటువంటి వాటిని సవరణ చేసి, నూతనంగా కొత్త బిల్లును తీసుకురావడానికి, 543 పార్లమెంటు సీట్లలోనే 33 % మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. కానీ బిల్లులో 50% అన్ని రాష్ట్రాలకు పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు పెంచుతామనే వాక్యం చేర్చకుండా కేవలం హామీ మాత్రమే ప్రధాని, హోం మంత్రి గారు ఇచ్చారు. ఈ విషయంలోనే ప్రతిపక్షాలు ఏకీభవించక గతంలో నరేంద్ర మోడీ ఎన్నికల అప్పుడు బ్లాక్ మనీ ద్వారా ప్రతి ఇంటికి 15 లక్షలు వారి అకౌంట్లో వేస్తామని నమ్మ పలికారు. కానీ దాన్ని అమలు జరపలేదు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చి బిల్లులో చేర్చలేదు అందువల్ల అది అమలు జరగలేదు ఈ విధంగా బిజెపి ప్రభుత్వము ప్రజలను ప్రతిపక్షాలను మోసం చేస్తూ కుటిల రాజకీయం చేస్తా ఉంది. అందువల్లనే పార్లమెంట్లో బిల్లును ఓడించి ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని దేశ సమగ్రత ను, ఐక్యతను కాపాడగలిగినాయి.దాన్ని వామపక్షా ప్రతిపక్ష పార్టీలు పసిగట్టి డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాల పైన దుమ్మెత్తి పోస్తున్నారన్నారు.. డి లిమిటేషన్ బిల్లు పాస్ అయితే దక్షిణాది రాష్ట్రాలు ఎంత నష్టపోతారో మీకు తెలియదా,?లేక మీకు తెలిసినా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర కీలుబొమ్మల్లాగా మారారా? అని ప్రశ్నించారు.. దక్షణాదిలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల ప్రతిపక్ష, అధికార పార్టీలు అన్నీ కూడా డైలీ మెడిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నాలుగు రాష్ట్రాలలో పోరాటం చేస్తుంటే కానీ మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన డి లిమిటేషన్ బిల్లుకు మద్దతు పలకడానికి తప్పబట్టారు.. ఒకవైపు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో మద్దతుతో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించా రూ. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంట్ స్థానాలలో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు.. 850 సీట్లు రాష్ట్రాలకు అసెంబ్లీ స్థానాలలో 50% పెంచుతామని నోటి మాట చెబుతున్నారు కానీ ఆ బిల్లులో పొందుపరచలేదన్నారు. అసెంబ్లీ సీట్లు పెంచుతామని బిల్లులో పెట్టకుండా దొంగ నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు.. నరేంద్ర మోడీ ఇలాంటి నోటిమాట హామీలు ఈ దేశంలో ఇప్పటికే చాలా హామీలు మిగిలిపోయాయి అన్నారు నేను అధికారంలోకి వస్తే నల్ల డబ్బులు అంతా వెలికి తీసి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కానీ నాడు బిల్లు ఏర్పాటు చేయలేదని దాన్ని వదిలేశారు ఈ రెండు అందులో గాలికి వదిలేశారు..దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. పార్లమెంట్లో 75% పైగా ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేకూర్చే విధంగా ఉంటాయి.. దక్షిణాది రాష్ట్రాల ఓటు లేకుండానే ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలతోనే ప్రధానమంత్రి కావాలని బిజెపి ప్రభుత్వం కుట్రబడుతుందన్నారు.. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులు తమ మాట ఏ మాత్రం చలబాటు కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్నారు.. కానీ ఈ బిల్లును వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వాము పక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు జోన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జోన్ లో ఏర్పాటలో 95% స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అలా కల్పించడం మంచిదే. అమరావతి రాజధాని ఇది 26 జిల్లాలకు సంబంధించిన రాజధాని అమరావతి రాజధాని ఫ్రీజ్ జోన్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండాలన్నారు. అమరావతి జోన్ లో మాత్రం స్థానికులకు 95% ఉద్యోగాలు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఉద్యోగాలు కల్పించే విధంగా ఉండాలని తెలిపారు. అమరావతిని ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే నన్ను అమలు జరపాలని సిపిఐ పార్టీగా తెలిపారు అవసరమైతే అమరావతి ఫ్రీజోన్ ఏర్పాటు చేసేంతవరకు సిపిఐ పార్టీ ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి నగర కార్యదర్శి శ్రీరాములు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కత్తి నారాయణస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్ గౌడ్ కుల్లాయి స్వామి జిల్లా సమితి సభ్యులు మహేష్ అల్లిపీరా తదితరులు పాల్గొన్నారు.


