భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి కీలక గమ్యస్థానాలకు ప్రయాణం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా నిరంతరం సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)



