కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి


తిరువనంతపురం: కేరళలోని త్రిసూర్ జిల్లాలోని బాణసంచా గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూరం వేడుక కోసం నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రాల్లో ఈ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. స్థానికంగా పంటపొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్‌లలో బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల పరిహారాన్ని ప్రకటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *