సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా “వాటర్ పాజిటివ్ ఆంధ్రా” థీమ్ అమలు అవగాహనతో సాధ్యమని, మన ఆసుపత్రి వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మార్చడానికి సమిష్టి కృషి అవసరం అని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో మాట్లాడుతూ…
“నీటిని సంరక్షించడం, వ్యర్థ నీటిని పునర్వినియోగం చేయడం, భూగర్భ జలాలను పెంచడం ఆవశ్యకతను తెలిపారు, ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 2500 ఔట్ పేషంట్స్ 1000 ఇన్ పేషెంట్లు, మెడికల్ కాలేజీ, హాస్టల్స్, క్వార్టర్స్‌తో పెద్ద క్యాంపస్‌గా ఉండటం వల్ల నీటి వినియోగం ఎక్కువగా ఉంది కనుక మనం తక్షణం చిన్నపాటి జాగ్రత్తలు అవగాహన తో నీటి వృథా అరికట్టగలం (వాటర్ పాజిటివ్) తద్వారా నీటి సమస్యలు తగ్గి, పేషెంట్ సేవలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. మన హాస్పిటల్ స్కోర్‌లో కూడా మంచి పాయింట్లు వస్తాయని తెలిపారు. వర్షపు నీటిని వడిసిపట్టే పద్ధతుల అమలు, హాస్పిటల్ ఆవరణలోని చిన్న ట్యాంకులు, సంపులు, డ్రైనేజ్ ఛానల్స్ శుభ్రపరచడం, లాండ్రీ, కిచెన్, బాత్‌రూమ్ వ్యర్థ నీటిని (గ్రే వాటర్) క్లీనింగ్‌కు వాడడం, ఎస్ టి పి (సేవజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ) నుండి వచ్చే నీటిని ట్రీటెడ్ వాటర్ రీయూజ్ చేయడం, పేషెంట్లు, అటెండెంట్లు, స్టాఫ్‌కు వాటర్ సేవింగ్ అవగాహన కార్యక్రమాలు, హాస్పిటల్ భవనాలు, హాస్టల్స్, క్వార్టర్స్‌లో వాటర్ ఆడిట్ నిర్వహించడం అవసరం అన్నార- రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల జాబితా చేసి రిపేర్ ప్లాన్ తయారు చేయడం,గ్రేవాటర్ రీయూజ్ సిస్టమ్ ఏర్పాటు రోజువారీ వాటర్ లాగ్ రిజిస్టర్ ప్రారంభించడం, పేషెంట్లు, స్టాఫ్‌కు అవగాహన పోస్టర్లు, మైక్ అనౌన్స్‌మెంట్లు ఏప్రిల్ నెలలో వాటర్ ఆడిట్ నిర్వహించి రిపోర్ట్ చేయాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రా కోసం కట్టుబడి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ డా.హేమలత, అడ్మినిస్ట్రేటర్ డా.సౌజన్య కుమార్, ఏడి వెంకట సుబ్బయ్య, శానిటేషన్ నోడల్ ఆఫీసర్ డా.నారాయణ స్వామి, నర్సింగ్ సూపరింటెండెంట్లు నిర్మలా బాయి లలిత, ఏఓ రమణ, డైటిషియన్ బాలనరసింహులు, మినిస్టీరియల్ సిబ్బంది , ఇన్ఫెక్షన్ కంట్రోల్ సిస్టర్స్, నర్సింగ్ సిబ్బంది శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
The post వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం! appeared first on Visalaandhra.


