ప్రిన్సిపాల్ వనిత వాణి
విశాలాంధ్ర ధర్మవరం; ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు విజయదుందుభి మోగించడం జరిగిందని ప్రిన్సిపాల్ వనిత వాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరపు లో 141 మంది పరీక్షలు రాయగా 117 మంది ఉత్తీర్ణత సాధించి 83 శాతంనమోదు కావడం జరిగిందన్నారు. ఒకేషనరీ విభాగంలో 85 మంది కు గాను 71 మంది ఉత్తీర్ణులు కాగా 84 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. టాపర్లుగా ఎస్. భవాని ఎంపీసీ 986 మార్కులు, పి గాయత్రి 985 మార్కులు ఎంపీసీ గ్రూప్, పి లలిత ఎంపీసీ గ్రూపులో 979 మార్కులు, ఎన్. మాధవి బైపీసీ గ్రూపులో 985 మార్కులు, బి హేమత పశ్వని బైపిసి లో 982 మార్కులు, ఎస్ అంజుం పరహాత్ సీఈసీ లో 934 మార్కులు, పి రుక్షార సీఈసీ లో 906 మార్కులు, పి వాణి హెచ్ఈసి లో 788 మార్కులు కైవసం చేసుకున్నారన్నారు. అదేవిధంగా ఒకేషనల్ లో ఎస్ సాఫీయా రెండవ ఎంఎల్టి లో 959 మార్కులు, ఎం సుప్రియ రెండవ ఎం పి హెచ్ డబ్ల్యు 954 మార్కులు, ఎన్ అంజుమాన్ కౌషల్ రెండవ ఎంపిహెచ్డబ్ల్యులో 947 మార్కులు సంపాదించారని తెలిపారు. తదుపరి ప్రథమ సంవత్సరం ఫలితాలలో 114 మంది పరీక్షలు రాయిగా 82 మంది ఉత్తీర్ణత సాధించారని మొత్తము 72 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. ఒకేషనల్ విభాగంలో 88 మంది హాజరుకాగా 58 మంది ఉత్తీర్ణులు అయ్యారని 66 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. టాపర్లుగా కే ప్రీతీ ఎంపీసీ గ్రూపులో462 మార్కులు, వి అమృతవల్లి ఎంపీసీ గ్రూపులో 459, డి గీతిక ఎంపీసీ గ్రూపులో 450 రెండు మార్కులు, ఒకేషనల్ లో కె అంజలి ఫస్ట్ ఓఏలో 476 మార్కులు, జి సంజీవరాణి ఎంపీహెచ్డబ్ల్యూలో 475 మార్కులు, డి జయశ్రీ ఎమ్మెల్టి లో 474 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. ప్రతిభ కనపరిచిన, కాపరుగా నిలిచిన విద్యార్థినీలకు ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, కళాశాల కమిటీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.


