ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల..


కళాశాల డైరెక్టర్ లు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో తమ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని డైరెక్టర్లు డోలా పెద్దారెడ్డి, భగవంతు రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎం సీతారామయ్య, ఏ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులందరికీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో ఎం మోక్షిత్ విజ్ఞామానసీ 463 మార్కులు, ఎం సాయి ప్రజ్ఞ న రెడ్డి 463 మార్కులు, హితేష్ కుమార్ 462, నరేంద్ర 461 సాధించగా, సిఈసి గ్రూపులో డి యశ్వంత్ 453, ఏ గణేష్ 429, ఎం ఇ సి గ్రూపులో ఎం సూర్య శశాంక్ 477 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులో బి. పార్థసారథి 988 మార్కులు, టీ సౌజన్ కుమార్ 983, బి భరత కిషోర్ 981, ఎస్ వినయ్ కుమార్ 979 మార్కులు సాధించడం జరిగిందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *