ఘనంగా చేనేత కార్మిక సంఘం 90 వ ఆవిర్భావ దినోత్సవం


విశాలాంధ్ర -ధర్మవరం; చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణం లో స్థానిక కదిరి గేట్ దగ్గర గల చేనేత విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 90వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ అధ్యక్షత వహించగా జెండా ఆవిష్కరణ కు ముఖ్యఅతిథిగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధుగారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా నేతన్న విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మధు చేనేత జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మధు, వెంకటనారాయణ మాట్లాడుతూ మన చేనేత కార్మిక సంఘం నేటికీ 90 వ వార్షికోత్సవం సందర్భంగా మన చేనేత పరిశ్రమ రక్షణకై చేనేత కార్మికులు శ్రేయస్సు కై సమరశీల పోరాటాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని 10- 4- 1936 లో ఆవిర్భవించింది అని,చేనేత సోదరి సోదరీమణులారా శ్రేయోభిలాషులారా భారత దేశంలో వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమని మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పరిశ్రమ ఈ చేనేత కళ 27 వేల సంవత్సరాల క్రితం ఆరప్ప మోహo జందార్ కాలంలో ఆనాటి చరిత్ర క త్రవ్వక లాలో బయట పడినటువంటి ఆధారం గా చరిత్ర కారు లు చెప్పే టట్టువంటి విషయం అప్పటికే చేనేత వస్త్రం తయారు దేశం లో ఉన్నది తెలిపారు. తరువాత కాలంలో 6000 సంవత్సరాల నుండి భారతదేశంలో చేనేత పరిశ్రమ చేనేత కళ నీ అనేది దేశంవ్య వెలుగోతుంది అని తెలిపారు. ఇది గమనించిన బ్రిటీష్ వాళ్లు ఈ చేనేత వృత్తిని ఆక్రమించి తద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని దుర్బుద్ధితో 18 18లో కలకత్తాకు 15 కిలోమీటర్ల దూరంలో బట్టల మిల్లును ఏర్పాటు చేసి ఈ చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి అనేక మందిని తమ పరిశ్రమ లోకి కూలీలుగా మార్చుకొని, ఈ చేనేత పరిశ్రమను దెబ్బతీస్తున్న తరుణంలో కార్మిక శక్తిని ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గ్రామం నివాసం పోచ్చల సత్యనారాయణ ఏలూరు నుండి కడుపు రాములు అలాగే కామ్ వీర్రాజు కృష్ణాజిల్లా లోని ఎర్ర త్రిశూల పాణి మెట్ల వీరయ్య. గుంటూరు జిల్లా నుండి గొంతు నాగయ్య. బండ్ల గారాటయ్య వీరందరి నాయకత్వంలో 1936.ఏప్రిల్ 10న తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో చేనేత కార్మిక సంఘం ఏర్పాటుచేసి ప్రధాన కార్యదర్శిగా పుచ్చల సత్యనారాయణ. సహాయ కార్యదర్శిగా కడుపు శ్రీరాములను ఎన్నోకొని కార్మిక పక్షాన అనేక పోరాటాలు నడుపుతున్న సమయంలో ఇది సహించలేని కొద్దిమంది మాస్టర్ యువర్స్ కొద్ది మంది వ్యాపారులు కు కార్మికులు ఎదురు తిరిగి సంఘం ప్రతిష్టను. కొనసాగించారు.అలాగే కూటమి ప్రభుత్వం చేనేత దినోత్సవం రోజున హామీ ఇచ్చిన చేనేత కార్మికులకు నేతన్న భరోసా 25000 వేల రూపాయలు చొప్పున రెండు సంవత్సరాలకు కలిపి 50 వేల రూపాయలు కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చేనేతకు జీఎస్టీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అలాగే నేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికులకు షరతులు లేకుండా అందించాలని వారు కోరారు. లేనిపక్షంలో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం అవుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ సాయం కార్యదర్శి రమణ శ్రీనివాసులు చేనేత సంఘం జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్, చేనేత నాయకులు శ్రీధర్, రామకృష్ణ,మల్లికార్జున,కొండ పార్థసారథి కొండ,రాజులు ఫవన్,లింగమ్మ,శివనాగేంద్ర, రామాంజి, గణేష్,ఆదినారాయణ మరియు చేనేత కార్మికులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *