సర్వే నంబర్ 650-2 లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలి


సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 650-2 సర్వే నంబర్ లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 650-2 సర్వే నెంబర్లో ప్లంబర్స్, అండ్ ఎలక్ట్రిషన్స్ కి కేటాయించిన రెండు ఎకరాల భూమిని కొంతమంది అన్యక్రాంతం చేసి ఆ స్థలంలో భవనాలు నిర్మించడం జరిగింది అన్నారు. వెంటనే ఆ భవనాలను తొలగించాలని, కార్మికులకు న్యాయం చేయాలని పట్టణం లో తాసిల్దార్ కార్యాలయం లో ఏప్రిల్ 15న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కావున ఈ ధర్నా కార్యక్రమానికి ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, రామసుబ్బయ్య, సురేంద్ర, చిన్న,జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *