Visakhapatnam: మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Fishing Ban 2026: విశాఖలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ రెండు నెలల పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చేపలు ఉండవు.  ఏప్రిల్ నెల 15 నుండి జూన్ నెల 14 వరకు మెఖనైజ్డ్ , మోటరైజ్డ్ బోట్లతో తూర్పు తీర భారత ప్రాదేశిక జలాలలో చేపల వేట నిషేధించింది.

visakapatnam
visakapatnam

Fishing Ban 2026: విశాఖలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ రెండు నెలల పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చేపలు ఉండవు.  ఏప్రిల్ నెల 15 నుండి జూన్ నెల 14 వరకు మెఖనైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్లతో తూర్పు తీర భారత ప్రాదేశిక జలాలలో చేపల వేట నిషేధించింది అని విశాఖపట్నం లోని ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. ఈ కాలంలో ఎక్కువ రకాల చేపలు గుడ్లు పెట్టి పునరుత్పత్తి జరుగుతుంది. సముద్రంలో మత్స్య సంపద పరిరక్షణ-నిర్వహణ, ఉత్పత్తి, మత్స్యకారుల భద్రతకై చేపల వేట నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుంది అని అన్నారు.

మోటార్ వినియోగించని సాంప్రదాయ బోట్లకు వేట నిషేధం నుండి మినహాయింపు ఉంది అన్నారు. మత్యకారులు వేట నిషేధాన్ని తప్పకుండా పాటించి సహకరించాలని కోరుతున్నాము అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన బోట్లపై ఆంధ్ర ప్రదేశ్ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ చట్టం 1995 క్రింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. వేట నిషేధకాలానికి గాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బోటుపై వేట చేస్తూ జీవనం గడిపే కుటుంబాలకు రు. 20,000 చొప్పున భృతిని మత్స్యకారుల సేవలో పధకం క్రింద చెల్లించడం జరుగుతుంది.

మత్స్యకారుల సేవలో పధకం క్రింద లబ్ధిపొందడానికి ఫిషింగ్ బోటు మెరైన్ షిప్పింగ్ చట్టం 1958 క్రింద తే 14.04.2026 లోపల రిజిస్ట్రేషన్ చేయబడి, ఆంధ్ర ప్రదేశ్ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ చట్టం 1995 క్రింద లబ్దిదారుల ఎంపిక తేదీ నాటికి వాలిడ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 మీ. కంటే ఎక్కువ పొడవు గల మెఖనైజ్డ్ బోట్లకు 10 మంది సిబ్బంది, 18 మీ. కంటే తక్కువ పొడవు గలమెఖనైజ్డ్ బోట్లకు 08 మంది సిబ్బంది, మోటారు బోట్లకు 6 మంది, సాంప్రదాయ- ఇంజన్ లేని (Non-Motorised) బోట్లకు 03 మంది సిబ్బంది (క్రూ) వరకు అర్హత ఉంటుంది. మెఖనైజ్డ్ బోట్ల యజమానులకు ఈ పధకం ద్వారా లబ్ది వర్తించదు. 2025-26 సం. లో చేపల వేట నిషేధ ఉల్లంఘన చేసి,అపరాధ రుసుం వేయబడిన బోట్లుకు ఈ లబ్ధి వర్తించదన్నారు.

ఫిషింగ్ బోట్లు సీవర్థినెస్ కలిగి, ప్రభుత్వం నిర్దేశించిన కలర్ కోడ్ కలిగి ఉండాలి. ఒక కుటుంబంలో ఒకే వ్యక్తికి హౌస్ హోల్డ్ ఆధారంగా ఈ పధకం వర్తిస్తుంది. లబ్ధి దారుడు తే 31.03.2026 ది నాటికి 18 నుండి 60సం. మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిభందనల మేరకు లబ్ధిదారుల జాబితా వాలిడేషన్ చేయబడిన అనంతరం అర్హులైన లబ్దిదారులకు డి.బి.టి. ద్వారా రు. 20,000 చొ. వారి బ్యాంక్ ఖాతాలకు రిలీఫ్ జమచేయడం జరుగుతుంది. లబ్ది దారులు వారి బోటు రిజిస్ట్రేషన్, లైసెన్స్, సిబ్బంది (క్రూ) ఆధార కార్డు, బ్యాంక్ ఖాతా ( active account) కాపీలు సంబంధిత మత్స్య శాఖ స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు సహాయకులు లేదా సంబంధిత మత్స్యశాఖ అభివృద్ది అధికారి వారికి అందజేయాలి అని అన్నారు.

జిల్లాలో గల అన్ని ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలలో గల బోట్లు, సిబ్బంది ఈనెల 17 న ఒకే రోజు ఎన్యూమరేసన్ చేయబడును. ఎన్యూమరేసన్ తేదీన బోటు, బోటు యజమానులు, సిబ్బందితో పాటు వారి ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలలో ఉండాలన్నారు. ఎన్యూమరేసన్ చేయబడిన బోట్లు , సిబ్బంది జాబితాలపై అభ్యంతరాల స్వీకరణకై సంభందిత గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ రైతు సేవా కేంద్రాలలో ప్రచురణ చేయబడుతుంది. స్వీకరించబడిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం, వాలిడేషన్ చేసిన తర్వాత అర్హులైన లబ్దిదారుల తుది జాబితా తయారు చేస్తారు. ఫైనల్ లిస్టులోని లబ్దిదారులు eKYC చేయించుకోవాల్సి ఉంటుంది. అర్హులైన మత్స్యకారులు ఈపధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *