సింహాచలం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం చందనం అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గంధపు పూతతో దర్శనమిచ్చే స్వామివారు, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయపలకలపై మూడు మణుగుల చందనాన్ని తొలి విడతగా అరగదీయడం విశేషం.
Source link


