Today Top 10 News: తీవ్ర ఆందోళనకు గురయ్యా అంటున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావును కలిశారు. కేసీఆర్ ఆయనను సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు, ఈ సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. జీవన్ రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

2. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో గోదాము ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల పంటలను కొనుగోలు చేసి వారం రోజుల్లో డబ్బులు జమ చేస్తున్నామని, ఎకరాకు రూ.12,000 రైతు భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్ దత్ పాల్గొన్నారు.

3. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రీ: కవిత విమర్శలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. సుమారు 35 వేల కోట్ల ప్రభుత్వ భూములు విక్రయానికి పెట్టి నిధులు దారి మళ్లిస్తున్నారని ఆమె విమర్శించారు. టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించి 1,140 కోట్ల కాంట్రాక్టులు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారని పేర్కొన్నారు.జీహెచ్‌ఎంసీ పాలన ప్రస్తుతం ‘గుంపు మేస్త్రి’ చేతుల్లో చిక్కి మహా అవినీతికి నిలయంగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు.

4. అది హిందూ సమాజం ఐక్యతనూ ఇది దెబ్బతీస్తుంది

సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఆలయాలు, మఠాల్లో ప్రవేశ ఆంక్షలు హిందూ సమాజ ఐక్యతకు హానికరమని మౌఖికంగా అభిప్రాయపడింది.

జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో శబరిమల కేసుపై విచారణ కొనసాగింది. కొన్ని ఆలయాల్లో కుటుంబ పరమైన ప్రవేశాలు ఉన్నాయని, ప్రైవేటు ఆలయాలు మినహా అందరికీ ప్రవేశం ఉండాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం శబరిమలలో మహిళలపై వయస్సు ఆంక్షలను సమర్థిస్తూ, ఇది మత విశ్వాసానికి సంబంధించిదని, తిలిపింది. దేశంలోని కొన్ని ఆలయాల్లో పురుషులకు సైతం అనుమతి లేదని తుషార్‌ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

5. జననాయగన్‌ లీక్‌..

కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే కొన్ని సన్నివేశాలు, పాట ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇది చట్టపరంగా నేరమని హెచ్చరించారు. సెన్సార్ సమస్యల కారణంగా సినిమా విడుదల వాయిదా పడగా, మద్రాసు హైకోర్టు సూచనలతో రివ్యూ కమిటీకి పంపారు. ఇప్పటికీ ఆ అనుమతి రాకపోవడంతో ‘జననాయగన్’ విడుదల ఎప్పుడనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

6. తీవ్ర ఆందోళనకు గురయ్యా: చిరంజీవి

విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే కొన్ని సన్నివేశాలు, పాట ఆన్‌లైన్‌లో లీక్ కావడంపై చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా లీక్ కావడం పరిశ్రమకు నష్టం చేస్తుందని, క్రియేటివ్ వర్క్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై నిర్మాత సంస్థకు మద్దతుగా నిలుస్తామని, దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

7.మద్యానికి బానిసనయ్యా!?: ఆమిర్‌ ఖాన్‌

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకుల సమయంలో తీవ్రమైన మానసిక కుంగుబాటుకు లోనయ్యానని వెల్లడించారు. ఆ సమయంలో ఒంటరితనాన్ని తట్టుకోలేక దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు మద్యం అలవాటు పడ్డానని తెలిపారు. తరువాత ఆ పరిస్థితి నుంచి బయటపడ్డానని, మానసికంగా కష్టమైన దశను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. ఆమిర్ ఖాన్, రీనా దత్తా 1986లో వివాహం చేసుకుని 2002లో విడిపోయారు.

8.ఇజ్రాయెల్- పాక్‌ మాటల యుద్ధం

పాకిస్థాన్‌లో అమెరికా–ఇరాన్ శాంతి చర్చల మధ్య ఇజ్రాయెల్–పాక్ దౌత్య వివాదం చెలరేగింది.పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ లెబనాన్‌లో ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ చేసిన పోస్టు కారణంగా ఉద్రిక్తత పెరిగింది. ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ఖండిస్తూ, శాంతి చర్చల్లో తటస్థంగా ఉన్న దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అసహనీయమని తెలిపింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ స్పందింస్తూ, తమ దేశంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

9.ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధాలు లేవు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 1998లో న్యూయార్క్‌లో ట్రంప్‌ను కలిసానని, ఎప్‌స్టీన్ నేరాల గురించి తనకు తెలియదని, గిస్లైన్ మ్యాక్స్‌వెల్‌తో సంబంధం లేదని చెప్పారు. ఎప్‌స్టీన్ బాధితులపై దృష్టి పెట్టి బహిరంగ విచారణ జరపాలని, వారికి వాగ్మూలం చెప్పే అవకాశం ఇవ్వాలని మెలానియా కోరారు.

10.కొత్త దశకు హర్మూజ్‌ నిర్వహణ

మొజ్తబా ఖమేనీ హర్మూజ్ జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని, మరింత కఠిన వ్యూహం అమలు చేస్తామని ప్రకటించారు. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, చమురు రవాణా విషయంలో హర్మూజ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదని, కానీ తమ హక్కులు వదులుకోమని స్పష్టం చేస్తూ, అయతుల్లా అలీ ఖమేనీ సహా మరణించిన నేతలకు ప్రతీకారం తీసుకుంటామని తెలిపారు. యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని పేర్కొని, జరిగిన నష్టాలకు పరిహారం డిమాండ్ చేస్తుంది ఇరాన్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *