Milk Price: సామాన్యులకు షాక్.. పెరిగిన పాల ధరలు |


ఆంధ్రప్రదేశ్‌లో విజయా డెయిరీ పాల ధరలను పెంచింది. ఏడు రకాల పాలపై లీటరుకి రూ.2 చొప్పున పెంచింది. అలాగే.. పెరుగు బకెట్లపై లీటరుకి రూ.10 నుంచి రూ.40 వరకూ పెంచింది. పెంచిన ధరలు ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది. ఐతే.. నెలవారీ కార్డులతో కొనేవారికి మాత్రం కొత్త ధరలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. పశువులకు దాణా, రైతులకు ఇచ్చే కూలీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలను పెంచినట్లు విజయ డెయిరీ తెలిపింది. ఐతే.. ఈ డెయిరీ ధరలను పెంచింది కాబట్టి.. త్వరలో మిగతా పాల కంపెనీలు కూడా ధరలు పెంచే ఛాన్స్ ఉంది.

ఇవాళ ఏమున్నాయి?

ఇరాన్ యుద్ధానికి 35 రోజులు పూర్తి అయ్యాయి. నేడు 36వ రోజు కొనసాగుతోంది. ప్రధాని మోదీ ఇవాళ తమిళనాడు, కేరళంలో పర్యటిస్తారు. న్యూయార్క్ లోని కొలంబియా వర్శిటీలో కేటీఆర్ ప్రసంగం ఉంటుంది. నేడు తెలంగాణలోని 3 మున్సిపాల్టీలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరుగుతాయి. అవి క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం. IPLలో ఇవాళ 2 మ్యాచ్‌లు ఉన్నాయి. DC vs MI (మ.3.30కి), GT vs RR (రా.7.30కి) ఉన్నాయి. నేడు నేషనల్ విటమిన్ C డే ఉంది. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *