Sri Rama Navami 2026: భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాల వెనుక హిస్టరీ తెలుసా..? | భద్రాద్రి కొత్తగూడెం వార్తలు (Bhadradri Kothagudem News)


Last Updated:

Bhadradri: శ్రీరాముడు, సీతాదేవి దంపతులు కల్యాణ మహోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలకు ఓ చరిత్ర ఉంది. ఈ కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ముత్యాల తలంబ్రాలు అంటారు.

Sri Rama Navami 2026: శ్రీరామనవమి రోజు యుగపురుషుడు శ్రీరాముని కల్యాణం సీతాదేవితో ఘనంగా జరుగుతుంది. ఈవేడుకలు దేశ వ్యాప్తంగా ప్రతీ గ్రామం, పట్టణం, నగరాల్లో కన్నుల పండువగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని భద్రాచలంలోని సీతారాముల దేవస్థానంలో లక్షలాది భక్తుల మధ్య ఈ కల్యాణం జరుగుతుంది. అయితే శ్రీరాముడు, సీతాదేవి దంపతులు కల్యాణ మహోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలకు ఓ చరిత్ర ఉంది. ఈ కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ముత్యాల తలంబ్రాలు అంటారు. అందుకే వీటిని అంతే పవిత్రంగా , శాస్త్రోక్తంగా తయారు చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో రెండు ఎకరాల్లో ప్రతియేటా రాములవారి కళ్యాణం కోసం వరి పండిస్తూ ఉంటారు. అసలు రాములవారి కల్యాణానికి ఆంధ్రాలో వడ్లు పండించడం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే ఈస్టోరీ పూర్తి గా చూడండి.

రాములోరి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు..

భద్రాచలంలోని సీతారామాలయంలో సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. ఈ లోకకల్యాణంగా భావించే ఉత్సవంలో ఉపయోగించే అక్షింతలు, తలంబ్రాలను తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో రెండు ఎకరాల్లో ప్రతియేటా రాములవారి కళ్యాణం కోసమే పండిస్తారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఈ వరి చక్కగా పండి రాములోరి కళ్యాణానికి వడ్లుగా మారాలని పంచభూతాలను ప్రార్థించి ఈ వరి పండించే ప్రక్రియ ప్రారంభిస్తారు.

దేవతలే దిగివచ్చినట్లు..

పంట వేసి అవి నూర్చే కార్యక్రమం దగ్గర నుంచి వరి కోతలు కోసే సమయంలో మాత్రం రామలక్ష్మణ ఆంజనేయ సుగ్రీవ వంటి దైవతామూర్తుల వేషధారణ వేసుకుని ఒకరి మేడలో మరొకరు పూలదండలు వేసుకుని శ్రీరామ నామ సంకీర్తనలు పాడుతూ ఈ వరి కోతలు చేపడతారు.అంటే తలంబ్రాలు తయారు చేసేందుకు ఎంత పవిత్రంగా భావిస్తారో అర్ధం చేసుకోవచ్చు.

14ఏళ్లుగా..

శ్రీసీతారాముల కల్యాణానికి దేవలోకం నుండి దేవతామూర్తులే పంట పొలాల్లోకి వచ్చి తలంబ్రాల కోసం వరి కోతలు చేపడతారని అర్ధం చేసుకోవచ్చు. వరి కోతల తర్వాత ఒడ్లుగా తయారుచేసి దాదాపు కోటి తలంబ్రాలు భద్రాచలం దివ్య క్షేత్రానికి పంపారు. ఏటా ఈ ఒడ్లు పంపడం తూర్పుగోదావరి జిల్లా వాసుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ సంస్కృతి ఒకటి రెండు సంవత్సరాల నుండి కాదు సుమారు 14 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *