Last Updated:
Vijayawada: దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించడంతో పాటు వారిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడం దేశ ప్రజలకు పరిచయం చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి కొత్తేమి కాదు. అయితే ఈసారి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ సింగర్‌కి ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగేలా చేశారు.
Vijayawada: దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించడంతో పాటు వారిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడం దేశ ప్రజలకు పరిచయం చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి కొత్తేమి కాదు. అయితే ఈసారి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ సింగర్‌కి ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగేలా చేశారు. బెజవాడ సత్యనారాయణపురంకు చెందిన శ్రీలలిత అనే గాయని తాజాగా పాడిన కనకదుర్గా మహా ప్రమావిత అనే పాటకు ప్రధాని ఫిదా అయ్యారు. ఆ విషయాన్నే ఆయన స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అందరితో పంచుకున్నారు. అంతే కాదు ఆ పాట యూట్యూబ్ లింక్‌ని తన సోషల్ మీడియా పోస్టులో షేర్ చేశారు. జగదంబ మాతను పూజించడం వల్ల మనసును అనంతమైన శక్తితో, ఆత్మవిశ్వాసంతో నింపుతుందని కామెంట్ పోస్ట్ చేశారు మోదీ.
విజయవాడకు చెందిన గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాట ప్రధాని మోదీకి బాగా నచ్చింది. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు. భక్తిపాట పాడిన ఒక తెలుగు సింగర్‌కి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం ఇప్పుడు మరోసారి శ్రీలలిత పేరు మారుమోగిపోతోంది.
मां जगदम्बे की उपासना से मन अनंत ऊर्जा और आत्मबल से भर जाता है। देवी मां का अलौकिक ओज हृदय को दिव्य चेतना से आलोकित कर देता है।https://t.co/hZwhd9AU8S
— Narendra Modi (@narendramodi) March 24, 2026
విజయవాడలో కనకదుర్గమాత శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గాయని శ్రీలలిత ఆలపించిన పాటకు ఇప్పటికే విశేషమైన స్పందన లభించింది. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఒక తెలుగు భక్తిగీతాన్ని ప్రశంసించడంతో ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది. మోదీ ప్రశంసలపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ నగరానికి చెందిన ఓ మహిళ పాడిన పాటను ప్రధాని గుర్తించి, ప్రజలతో పంచుకోవడం విజయవాడ వాసులందరికీ గర్వకారణమని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రతిభకు ప్రధాని నుంచి ప్రోత్సాహం లభించడం ఎంతో సంతోషకరమని అన్నారు.ఏది ఏమైనా ఓ తెలుగమ్మాయికి పేరును దేశ ప్రజలందరికి పరిచయం చేసేలా మోదీ ట్వీట్ చేయడం, ఆమె పాట యూట్యూబ్ లింక్‌ని షేర్ చేయడం నిజంగా గొప్ప విషయమని విజయవాడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీలలిత సింగర్‌గా ఇప్పటే సుపరిచితురాలు. దివంగత లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్వహించిన పాడుతా తీయగా మ్యూజిక్ ప్రోగ్రామ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విజయవాడ అమ్మాయి.. తర్వాత సింగర్‌గా అనేక పాటలు పాటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా పాటలు కూడా పాడటం విశేషం. తాజాగా శ్రీలలితకు నిశ్చితార్థం కూడా జరిగింది. ఈవిషయాన్ని ఆ ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా తన సంగీతాన్ని అభిమానించే వారికి షేర్ చేసింది.
Vijayawada,Krishna,Andhra Pradesh



