Simhachalam Temple: ఉగాది నాడు అప్పన్న సన్నధిలో.. ఉచిత సామూహిక అక్షరాభ్యాసం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Ugadi Special Aksharabhyasam: ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగానే ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో చిన్నారుల కోసం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగనుంది.

ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలంలో చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం
ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలంలో చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం

Simhachalam Temple: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారు దేవస్థానం సింహాచలం ఉత్తరాంధ్ర భక్తుల హృదయంలో నిలిచిన పుణ్యక్షేత్రం. భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన పుణ్యక్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనది. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కోరిన కోర్కెలు తీర్చే బంగారు తండ్రిగా కొలువయ్యారు. విశాఖపట్నంలోని తూర్పు కనుమలలో ఉన్న పర్వత శ్రేణి పై ఈ హిందూ పుణ్యక్షేత్రము వుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తులు సింహాద్రి అప్పన్నగా పిలుస్తూ కొలుచుకుంటారు. సింహాచలం కొండపై ప్రముఖ కార్యక్రమాలు , పండగలు అంగరంగ వైభవంగా చేస్తారు.

ఉగాది రోజున అక్షరాభ్యాసం..

ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగా పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో చిన్నారుల కోసం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని  నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి  జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని 6A కేటగిరీ దేవాలయాలలో నిర్వహించబడుతున్న ఈ విశిష్ట కార్యక్రమంలో భాగంగా, సింహాచలం పుణ్యక్షేత్రంలో కూడా ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 19 మార్చి 2026 (గురువారం – ఉగాది పర్వదినం ఉదయం 9:00 గంటల కు నిర్వహించబడును అని తెలిపారు.

పర్వదినం నాడు పవిత్ర కార్యక్రమం..

స్వామివారి దివ్య ఆశీస్సులతో చిన్నారుల విద్యాభ్యాసాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది అని తెలిపారు. భక్తులు,  తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకునేందుకు ఇది ఒక శుభప్రదమైన, సువర్ణ అవకాశం అని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 9 గంటల లోపు ఆలయ ప్రాంగణంలోకి చేరుకోవాలని తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం కోసం దేవస్థానం సమాచార కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *